మంత్రి పదవి వద్దని తాను అధిష్ఠానానికి చెప్పలేదని కేంద్ర మంత్రి బండి సంజయ్ తెలిపారు. హైకమాండ్ ఏ బాధ్యత ఇచ్చినా నిర్వహిస్తానని చెప్పారు. ఎవరికి ఏబాధ్యత ఇవ్వాలనేది అధిష్ఠానం నిర్ణయిస్తుందన్నారు. రైతును రాజు చేయడమే ప్రధాని మోదీ , బీజేపీ పార్టీ లక్ష్యమని వివరించారు. 11ఏళ్లలో రైతుల కోసం రూ.71 లక్షల కోట్లు ఖర్చు చేశామన్నారు. టెన్త్ బాగా చదివి ఉత్తీర్ణులయ్యే విద్యార్థులకు స్కూటీలు ఇప్పించేందుకు ప్రయత్నిస్తానని చెప్పారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa