మద్దులపల్లి గ్రామంలో ఖమ్మం - సూర్యాపేట ప్రధాన రహదారిపై ఆగి ఉన్న లారీని సూర్యాపేట డిపో ఆర్టీసీ బస్సు గురువారం ఢీకొట్టింది. ఈ ఘటనలో బస్సు డ్రైవర్ క్యాబిన్‌లో ఇరుక్కుపోయారు, ఆయన కాళ్లు విరిగినట్లు సమాచారం. బస్సులో ఉన్న 40 మంది ప్రయాణికులు క్షేమంగా బయటపడగా, మరో ముగ్గురికి స్వల్ప గాయాలయ్యాయి. పోలీసులు క్రేన్ సహాయంతో డ్రైవర్‌ను బయటకు తీశారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa