రాజేంద్రనగర్ సర్కిల్, మైలర్ దేవ్ పల్లి డివిజన్ పరిధిలోని ఆదర్శ కాలనీలో శ్రీ అభయాంజనేయ శ్రీ శివ పంచాయతన దేవాలయం ఆధ్వర్యంలో గణపతి నవరాత్రి ఉత్సవాలు భక్తి శ్రద్ధలతో వైభవంగా కొనసాగుతున్నాయి. ఈ సందర్భంగా సోమవారం ఏర్పాటు చేసిన గణపతి మండపం వద్ద ప్రత్యేక పూజలు నిర్వహించారు. తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ ప్రధాన కార్యదర్శి సానేం శ్రీనివాస్ గౌడ్, సహాయ కార్యదర్శి పార్వతలు రాజేందర్ ముఖ్య అతిథులుగా పాల్గొని అన్నప్రసాదం పంపిణీ చేశారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa