TG: ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితను సస్పెండ్ చేస్తూ పార్టీ అధిష్టానం అధికారిక ప్రకటన చేసింది. ఇటీవల పార్టీకి వ్యతిరేకంగా కవిత వాయిస్ వినిపించడంతో ఈ నిర్ణయం తీసుకున్నారు. మాజీ మంత్రి హరీష్‌రావు, మాజీ ఎంపీ సంతోష్ కుమార్‌పై ఆమె తీవ్ర ఆరోపణలు చేశారు. మాజీ సీఎం కేసీఆర్‌కు మరక అంటించడంలో హరీశ్‌రావు, సంతోష్‌ల అవినీతే ప్రధాన కారణమని.. ఇందులో ముఖ్యపాత్ర హరీశ్‌రావుదేనని కవిత ఆరోపించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa