TG: మెదక్ జిల్లా తూప్రాన్‌లో బుధవారం నూతనంగా ప్రారంభించిన వస్త్ర దుకాణంలో దసరా ఆఫర్ కింద రూ.99కే చీర అందిస్తామని ప్రకటించడంతో వందలాది మహిళలు దుకాణానికి పోటెత్తారు. బస్టాండ్ సమీపంలో జరిగిన ఈ సంఘటనలో, మహిళలు ఒకేసారి దుకాణంలోకి చొచ్చుకెళ్లడంతో తొక్కిసలాట పరిస్థితి ఏర్పడింది. పోలీసులు వెంటనే రంగంలోకి దిగి పరిస్థితిని అదుపులోకి తెచ్చారు. ఈ ఘటన స్థానికంగా చర్చనీయాంశమైంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa