భద్రాచలం వద్దా గోదావరి వరద తగ్గినట్లే తగ్గి మళ్లీ పెరుగుతోంది. శనివారం రాత్రి 42.9 అడుగులకు తగ్గడంతో మొదటి ప్రమాద హెచ్చరిక ఉపసంహరించుకున్నారు. మళ్లీ పెరిగి ఆదివారం మధ్యాహ్నం 3 గంటలకు 43 అడుగులకు చేరడంతో 1వ ప్రమాద హెచ్చరికను జిల్లా కలెక్టర్ జీతిస్ వి పాటల్ జారీ చేశారు. సోమవారం 9 గంటలకు 44.9 వద్దా వరద ప్రవాహం కొనసాగుతుంది. వరద ప్రవాహం పెరిగే అవకాశం ఉన్నట్లు సిడబ్ల్యూసీ అధికారులు అంచనా వేస్తున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa