TG: నల్లమల అటవీ ప్రాంతాల సందర్శనకు ప్రకృతి ప్రేమికులు, పర్యాటకుల కోసం సఫారీ సేవలు ఈ నెల 1 నుంచి తిరిగి ప్రారంభమయ్యాయి. మూడు నెలల పాటు వన్యప్రాణుల సంతానోత్పత్తి సమయంలో నిలిపివేసిన ఈ సేవలను తెలంగాణ ప్రభుత్వం పునఃప్రారంభించింది. అమ్రాబాద్ టైగర్ రిజర్వ్ (ఏటీఆర్)లోని పర్యాటక ప్రాంతాలను, కృష్ణానదిని, జలపాతాలను, పులులు, చిరుతలను చూసేందుకు అవకాశం కల్పించారు. సఫారీ, ట్రెక్కింగ్, టైగర్ స్టే సేవలకు ఆన్లైన్లో లేదా ఫోన్ ద్వారా ముందస్తు బుకింగ్ చేసుకోవచ్చు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa