మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం (MGNREGS) పేరును మార్చేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రయత్నించడాన్ని నిరసిస్తూ, ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ నాగరిగారి ప్రీతం తెలంగాణ రాష్ట్ర బీజేపీ కార్యాలయాన్ని హైదరాబాద్‌లోని కూకట్‌పల్లిలో ముట్టడించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, గ్రామీణ పేదలకు జీవనాధారమైన ఈ పథకం పేరు మార్చడం దేశ చరిత్రను, పేదల హక్కులను తుంగలో తొక్కినట్లేనని విమర్శించారు. రాజకీయ ప్రయోజనాల కోసం పథకాన్ని వాడుకోవడం సరికాదని, వెంటనే ఈ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని, లేకపోతే రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలు ఉధృతం చేస్తామని హెచ్చరించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa