TG: వికారాబాద్ జిల్లా తాండూరు మండలంలో దారుణ ఘటన చోటుచేసుకుంది. పరమేష్, అనూష అనే ఇద్దరు 8 నెలల క్రితం ప్రేమ వివాహం చేసుకున్నారు. ఇటీవల ఇద్దరి మధ్య గొడవలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో గురువారం భార్యాభర్తల మధ్య మరోసారి ఘర్షణ జరిగింది. అయితే ఆవేశంలో పరమేశ్ భార్య అనూషపై దాడి చేశారు. ఈ దాడిలో తీవ్రంగా గాయపడిన అనూష(22) అక్కడికక్కడే మృతిచెందింది. అయితే కట్నం కోసం భర్త, అత్తమామలు అనుషపై దాడి చేశారని మృతురాలి బంధువులు ఆరోపిస్తున్నారు. నిందితులు పరారిలో ఉన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa