నాగర్ కర్నూల్ జిల్లాలోని మన్ననూర్ రేంజ్‌లో పరహాబాద్ చౌరస్తా సమీపంలో బుధవారం రాత్రి హైదరాబాద్-శ్రీశైలం జాతీయ రహదారిపై ఒక పెద్దపులి సంచరించింది. వాహనాల హెడ్‌లైట్ల వెలుగులో రోడ్డుపై నడిచిన పులిని చూసి యాత్రికులు భయాందోళనకు గురయ్యారు. కొందరు యాత్రికులు తమ మొబైల్‌లలో ఈ దృశ్యాన్ని వీడియో తీయగా, ఆ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa