పెరిగిన రైల్వే టికెట్ ధరలు నేటి నుంచి అమల్లోకి వచ్చాయి. 216-750 కి.మీ ప్రయాణానికి రూ.5, 751-1250 కి.మీకు రూ.10, 1251-1750 కి.మీకు రూ.15, 1751-2250 కి.మీకు రూ.20 అదనంగా చెల్లించాలి. స్లీపర్, ఫస్ట్ క్లాస్ చార్జీలు కిలోమీటరుకు ఒక పైసా, మెయిల్/ఎక్స్‌ప్రెస్, ప్రీమియం రైళ్లలో కిలోమీటరుకు 2 పైసలు పెరిగాయి. ఈ పెంపుతో రైల్వేలకు సంవత్సరానికి రూ.600 కోట్ల ఆదాయం వస్తుంది. సబర్బన్ రైళ్ల చార్జీలు యథాతథం. ఈ ఏడాది ఇది రెండోసారి టికెట్ ధరల పెంపు. డిసెంబర్ 26కు ముందు బుక్ చేసుకున్న టికెట్లకు ఈ చార్జీలు వర్తించవు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa