ట్రెండింగ్
Epaper    English    தமிழ்

మేడారం భక్తులకు గుడ్ న్యూస్‌: ఆలయం ప్రత్యేక కార్యక్రమాలతో సిద్దం

Telangana Telugu |  Suryaa Desk  | Published : Wed, Jan 21, 2026, 10:00 PM

తెలంగాణలో మేడారం జాతరకు భక్తులకు శుభవార్త. రేపటి నుండి మేడారం భక్తులు హెలికాప్టర్‌ సవారీ సేవలను అనుభవించవచ్చునని అధికారులు తెలిపారు. తెలంగాణ టూరిజం శాఖకు చెందిన జాయ్ సేవలను మంత్రి సీతక్క ములుగులో అధికారికంగా ప్రారంభించనున్నారు.వివరాల ప్రకారం, తెలంగాణ టూరిజం శాఖ మేడారం భక్తుల కోసం హెలికాప్టర్‌ సవారీని అందుబాటులోకి తీసుకొచ్చింది. తాడ్వాయి మండలం ఎలుబాక ప్రాంతం నుండి హెలికాప్టర్‌ ద్వారా మేడారం ఆలయాన్ని ఏరియల్ వ్యూ లో వీక్షించగలరు. టూరిజం శాఖ తెలిపినట్లుగా, ఒక్కరికి 5,000 రూపాయల చార్జీతో సుమారు ఏడు నిమిషాల పాటు హెలికాప్టర్‌ సవారీ అవకాశం లభిస్తుంది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa