మునిసిపల్ ఎన్నికల నేపథ్యంలో పటాన్‌చెరు నియోజకవర్గం, ఇస్నాపూర్ మునిసిపాలిటీ పరిధిలోని రుద్రారంలో బీఆర్ఎస్ నాయకులు మాద్రి ప్రిథ్వీరాజ్ గారు నగులమ్మ దేవాలయం, ఆంజనేయ స్వామి ఆలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం బీఆర్ఎస్ పార్టీ తరఫున పోటీ చేస్తున్న అభ్యర్థులకు మద్దతుగా విస్తృత ఎన్నికల ప్రచారం చేపట్టారు.ఈ ప్రచారంలో 23వ వార్డు అభ్యర్థి గాయత్రి పాండు గారు, 24వ వార్డు అభ్యర్థి శ్రీమతి శ్రీ పెళిమెలి లత – వెంకట్ ముదిరాజ్ గారు, 25వ వార్డు అభ్యర్థి జంగంపేట్ సాయిబాబా గారితో కలిసి ఆయా వార్డుల్లో ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రిథ్వీరాజ్ గారు ప్రజలతో నేరుగా మాట్లాడి వారి సమస్యలను తెలుసుకున్నారు.గత 10 సంవత్సరాల బీఆర్ఎస్ ప్రభుత్వ పాలనలో రాష్ట్రం వ్యవసాయం, సాగునీరు, తాగునీరు, విద్యుత్, సంక్షేమ పథకాలు, మౌలిక వసతుల రంగాల్లో చారిత్రాత్మక అభివృద్ధి సాధించిందని ఆయన తెలిపారు. ప్రజల అవసరాలను కేంద్రంగా చేసుకుని పాలన సాగించిన ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వమేనని పేర్కొన్నారు.అభివృద్ధి కొనసాగాలంటే మునిసిపల్ ఎన్నికల్లో కార్ గుర్తుకు ఓటు వేసి బీఆర్ఎస్ అభ్యర్థులను భారీ మెజారిటీతో గెలిపించాలని ఆయన ప్రజలను కోరారు. ప్రచారానికి ప్రజల నుంచి మంచి స్పందన లభించిందని, పార్టీ విజయదిశగా ముందుకు సాగుతోందని తెలిపారు.ఈ కార్యక్రమంలో గడీల కుమార్ గౌడ్ గారు, సుధీర్ రెడ్డి గారు, మన్నే రాజు గారు, సత్యనారాయణ గారు, నవీన్ గౌడ్, మధు, శివ గౌడ్‌తో పాటు బీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు మరియు MPR యువసేన సభ్యులు తదితరులు పాల్గొన్నారు
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa