సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ‘ఎక్స్’ (ట్విట్టర్) తమ కంటెంట్ క్రియేటర్లకు కీలక హెచ్చరిక జారీ చేసింది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) టెక్నాలజీతో సృష్టించిన యుద్ధ సంబంధిత వీడియోలను పోస్ట్ చేసేటప్పుడు, ఆ విషయాన్ని స్పష్టంగా వెల్లడించకపోతే కఠిన చర్యలు తప్పవని స్పష్టం చేసింది. అలాంటి క్రియేటర్లను రెవెన్యూ-షేరింగ్ ప్రోగ్రామ్ నుంచి 90 రోజుల పాటు సస్పెండ్ చేయనున్నట్లు ప్రకటించింది.ఈ కొత్త నిబంధనలను ఎక్స్ ప్రొడక్ట్ హెడ్ నికితా బేర్ వెల్లడించారు. యుద్ధ సమయాల్లో తప్పుడు సమాచారం వ్యాప్తిని అరికట్టి, ప్లాట్‌ఫామ్‌పై వాస్తవికతను కాపాడేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. "ప్రస్తుత ఏఐ టెక్నాలజీతో ప్రజలను సులభంగా తప్పుదోవ పట్టించే కంటెంట్‌ను సృష్టించవచ్చు. అందుకే ఈ మార్పులు చేస్తున్నాం" అని ఆయన పేర్కొన్నారు. మొదటిసారి సస్పెన్షన్ తర్వాత కూడా నిబంధనలను ఉల్లంఘిస్తే, రెవెన్యూ ప్రోగ్రామ్ నుంచి శాశ్వతంగా తొలగిస్తామని హెచ్చరించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa