దేశవ్యాప్తంగా జరగనున్న జాతీయ జనాభా గణన (జనగణన) ప్రక్రియలో భాగంగా తెలంగాణలో తొలి దశ పనులను పకడ్బందీగా నిర్వహించేందుకు రేవంత్ రెడ్డి ప్రభుత్వం సన్నద్ధమవుతోంది. ఇందులో భాగంగా మే 11 నుంచి జూన్ 9 వరకు రాష్ట్రవ్యాప్తంగా ఇళ్లు, ఇతర కట్టడాల వివరాలను నమోదు చేసే కార్యక్రమాన్ని చేపట్టాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (సీఎస్) కె. రామకృష్ణారావు అధికారులను ఆదేశించారు. మంగళవారం సచివాలయంలో జిల్లా కలెక్టర్లు, అన్ని శాఖల కార్యదర్శులతో ఆయన ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించి, కీలక మార్గదర్శకాలు జారీ చేశారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa