సీటెట్-2022 దరఖాస్తులో పొరపాట్లను దిద్దుకునేందుకు శనివారంతో గడువు ముగియనున్నట్లు సీబీఎస్‌ఈ తెలిపింది. దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్
ctet.nic.in ద్వారా దరఖాస్తు ఫారమ్‌లో వివరాలను సవరించవచ్చని పేర్కొంది. అభ్యర్థులు పరీక్ష రాసే నగరాన్ని కూడా మార్చుకోవచ్చు. డిసెంబర్ 2022 లేదా జనవరి 2023లో కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ (CBT) విధానంలో పరీక్ష జరగనుంది. దేశవ్యాప్తంగా వివిధ కేంద్రీయ విద్యాలయాలు, నవోదయ విద్యాలయాలలో ప్రాథమిక, ప్రాథమికోన్నత స్థాయి టీచర్ల నియామకాల కోసం సీటెట్ స్కోరును పరిగణనలోకి తీసుకుంటారు.