జేఈఈ మెయిన్, అడ్వాన్స్‌డ్ పరీక్షలకు ఇంటర్ లో కనీస మార్కుల నిబంధనను పునరుద్ధరించాలని కేంద్ర విద్యాశాఖ, ఎన్‌టీఏలు భావిస్తున్నాయి. కరోనా కారణంగా 2020 నుంచి 2022 వరకు ఈ నిబంధనను ఎత్తివేసిన విషయం తెలిసిందే. చాలా రాష్ట్రాల్లో ఇంటర్ లేదా 12వ తరగతి వార్షిక పరీక్షలు జరగకపోవడంతో ఈ నిబంధనను ఎత్తివేశారు. అయితే జేఈఈ మెయిన్, అడ్వాన్స్‌డ్-2023 కు మళ్లీ ఈ నిబంధనలను అమలు చేయాలని ప్రాథమికంగా నిర్ణయించినట్టు సమాచారం. ఈ నిబంధన ప్రకారం ప్రవేశాలు పొందాలంటే జేఈఈలో ర్యాంకుతో పాటు ఇంటర్ లో ఎస్సీ, ఎస్టీ విద్యార్థులు 65%, ఇతరులు 75% మార్కులు పొందటం తప్పనిసరి.