వైద్య విద్యార్థులు చివరి ఏడాదిలో ఇక థియరీ పరీక్షలు రాయనక్కర్లేదు. వాటికి బదులు రెండుసార్లు ప్రాక్టికల్ పరీక్షలకు హాజరవ్వాల్సి వస్తుంది. ‘నేషనల్ ఎగ్జిట్ టెస్ట్ (నెక్స్ట్)’ పేరిట జాతీయ వైద్య కమిషన్ ప్రవేశపెడుతున్న నూతన విధానంలో పలు మార్పులు చేశారు. నెక్స్ట్‌లో స్టెప్ 1, 2 అనే రెండు రకాల పరీక్షలుంటాయి. ఈ రెండు పరీక్షల్లో ఉత్తీర్ణత సాధిస్తేనే, పీజీ కోర్సుల్లో ప్రవేశాలకు, వైద్యులుగా ప్రాక్టీసుకు అర్హత లభిస్తుంది. ఇక నీట్ పీజీ పరీక్ష ఉండదు. దీని స్థానంలో ఈ రెండు పరీక్షలనే ప్రామాణికంగా తీసుకుంటారు.