ఐఏఎస్, ఐపీఎస్ వంటివి సాధించాలని సివిల్స్ ఎగ్జామ్స్‌కు వేల సంఖ్యలో యువత సన్నద్ధం అవుతుంటారు. అయితే సివిల్స్ ఆశావహులకు పరీక్ష పట్ల ఆందోళన, వైఫల్యం అవుతామనే భయం, తప్పుడు సలహాలు, సమాచారం వంటి సమస్యలు ఎదురవుతాయి. చక్కటి కోచింగ్ కోసం ఏదైనా పెద్ద నగరాలకు వెళ్లాలేమో అనే మీమాంస ఉంటుంది. అయితే సరైన ప్రణాళిక, సంసిద్ధతతో సివిల్స్ విజేతగా ఆశావహులు నిలవొచ్చు.
సివిల్స్ సిలబస్‌పై సంపూర్ణ అవగాహన కావాలంటే సమయం వెచ్చించాలి. అంశాల వారీగా అధ్యయనం అవసరం. పరీక్ష ప్రశ్నల సరళిని మరియు స్కోరింగ్ సరళిని అర్థం చేసుకోవడం అంత సులభం కాదు. దీని కోసం సివిల్స్ ప్రిపరేషన్ చేసే సహచరులు, టీచర్లతో మాట్లాడాలి. సివిల్స్ విజేతల వ్యూహాన్ని, పరీక్షకు ప్రిపేర్ అయిన విధానానని తెలుసుకోవాలి. UPSC పరీక్ష సిలబస్ భౌగోళికం, రాజకీయాలు, చరిత్ర, ఆర్థిక శాస్త్రం, అంతర్జాతీయ సంబంధాలు, సైన్స్ అండ్ టెక్నాలజీపై ఇంటర్‌నెట్‌లో కావాల్సినంత సమాచారం ఉంటుంది. నిర్దిష్ట సబ్జెక్ట్‌ని ఐచ్ఛికంగా ఎంచుకుని, అవగాహన పెంచుకోవాలి. సిలబస్‌ను చిన్న భాగాలుగా విభజించి ఒక్కొకటి పూర్తి చేయాలి. కరెంట్ అఫైర్స్‌ను ఎప్పటికప్పుడు తెలుసుకోవాలి.
తొలి ప్రయత్నంలోనే విజయం సాధించకపోవచ్చు. దీనికి సహనం, ఓర్పు అవసరం. సివిల్స్ ప్రిపరేషన్ ఖర్చుతో కూడుకున్న పని. కోచింగ్ క్లాసులు, పుస్తకాలకు అధిక ఖర్చు అవుతుంది. సమస్య అధిగమించేందుకు ఆన్‌లైన్ సమాచారం, వీడియోలు ఉత్తమ ప్రత్యామ్నాయం. తొలి ప్రయత్నంలో విఫలమైతే క్రుంగిపోకుండా, లోపాలను సరిదిద్దుకుని ముందుకు సాగాలి. మల్టిపుల్ ఛాయిస్ క్వశ్చన్‌లను వేగవంతంగా ఆన్సర్ గుర్తించగలగాలి. వ్యాస రూప ప్రశ్నలకు విశ్లేషీకరించే సామర్థ్యం పెంచుకోవాలి. ఇంటర్వ్యూను విజయవంతంగా పూర్తి చేయాలంటే మాక్ ఇంటర్వ్యూలు అవసరం. ప్రాక్టీస్ పరీక్షలకు షెడ్యూల్ వేసుకుని ఆత్మవిశ్వాసంతో అధ్యయనం సాగించాలి