ఏపీ ఇంటర్ బోర్డు కీలక నిర్ణయం తీసుకుంది. ఇంటర్ ప్రాక్టికల్స్ పరీక్షలకు 90 శాతం హాజరు ఉన్నవారికే హాల్ టిక్కెట్లు ఇవ్వాలని ఇంటర్ విద్యా మండలి కార్యదర్శి శేషగిరి ఆదేశించారు. థియరీ పరీక్షలకు 75 శాతం హాజరు ఉన్నవారినే అనుమతిస్తున్న విషయం తెలిసిందే. ఈ నెల 26 నుండి మార్చి 7 వరకు ఇంటర్మీడియట్ ప్రాక్టికల్స్ జరగనుండగా, ఉదయం, మధ్యాహ్నం రెండు విడతల్లో నిర్వహించనున్నారు.