ఉపమాక వెంకన్న కల్యాణోత్సవాల్లో భాగంగా మంగళవారం స్వామివారి చక్రస్నానం కన్నుల పండువగా జరిగింది. ముందుగా ఉభయదేవేరులతో కూడిన కల్యాణ వేంకటేశ్వరుడిని రాజాధిరాజ వాహనంపై అలంకరించి మాఢవీధుల్లో ఊరేగించారు. అనంతరం ఇక్కడికి నాలుగు కిలోమీటర్లు దూరంలో వున్న రాజయ్యపేట సముద్రతీరానికి స్వామివారిని తీసుకెళ్లారు. ఈ సందర్భంగా రాజయ్యపేట తీరంలో సుదర్శన పెరుమాళ్ ఉత్సవ మూర్తికి సముద్రజలాలతో చక్రస్నానం చేయించారు. ఈ సమయంలో భక్తులు ఎంతో భక్తి పారవశ్యంతో మునిగిపోయారు. తదుపరి రాజయ్యపేట తీరం వద్ద కల్యాణ వేంకటేశ్వరుడికి ఆలయ అర్చకులు ప్రత్యేక పూజలు ధూప, దీప నైవేద్యాలు సమర్పించారు. అనంతరం భక్తులకు ప్రసాదాలను పంపిణీ చేశారు.