కుంకుడుకాయలను తల స్నానం చేయడానితి ఉపయోగిస్తారన్న విషయం తెలిసిందే. అయితే వీటితో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. వీటిలోని సెపోనిన్ వలన నురగ తయారై తలపైనున్న మలినాలు తొలగిపోతాయి. కుంకుడుకాయ రసం సూక్ష్మక్రిమి సంహారిణిగా పనిచేస్తుంది. తలలో కురుపులు, చుండ్రు మొదలైన సమస్యలను ఇది తగ్గిస్తుంది. కుకుండు ఆకులను మెత్తగా నూరి నూనెతో వేయించి గోరువెచ్చగా తలకు పట్టిస్తే తలనొప్పి నుండి ఉపశమనం కలుగుతుంది.