వేసవిలో బటర్ మిల్క్ ఆరోగ్యమని తెలిసిందే. ధనియాలు, జీలకర్ర, శొంఠి 100 గ్రా చొప్పున దేనికదే మెత్తగా దంచి, మూడింటినీ కలిపి తగినంత ఉప్పు చేర్చి ఆ మిశ్రమాన్ని భద్రపరుచుకోవాలి. కాచి చల్లార్చిన గ్లాసుడు పాలలో 2 గ్లాసుల పుల్లని మజ్జిగ కలపాలి. ఈ ద్రావణంలో పై మిశ్రమం చెంచాడు కలిపి తీసుకుంటే వడదెబ్బ నుంచి రక్షణివ్వడమే కాక, పేగులకు బలం, జీర్ణకోశ వ్యాధులన్నింటినీ దూరం చేస్తుందని వైద్య నిపుణులు సూచిస్తున్నారు.