సులువుగా జీర్ణమయ్యే ఆహారాల్లో ఖర్జూరం ఒకటి. ఖర్జూర పండు తరచూ తినడం వల్ల మూత్రపిండాల్లో రాళ్లు తొలగిపోతాయి. బాలింతలు ఖర్జూర పండు తినడం వల్ల బాగా పాలు పడతాయి. రోగ నిరోధక శక్తిని పెంచడంలో ఖర్జూరం అద్భుతంగా పనిచేస్తుంది. పురుషుల్లో వీర్య కణాల ఉత్పత్తికి దోహదపడుతుంది. పైత్యం, మొలలు, కఫం, ఉబ్బసం, వాతం, జ్వరం, అతిసారం, దగ్గు వంటి వాటిని నయం చేయడంలో సర్వరోగ నివారణిలా పనిచేస్తుంది.