గర్భధారణ సమయంలో పచ్చి బాదం తినడం మహిళలకు చాలా మంచిదని భావిస్తారు. ఇందులో ఐరన్, కాల్షియం, ఫోలిక్ యాసిడ్, ఫైబర్ వంటి పోషకాలు పుష్కలంగా ఉన్నాయి. అయితే అలర్జీ ఉన్న గర్భిణులు వైద్యుల సలహాతో వాటిని తీసుకోవాలి. అలాగే బాదంపప్పు లేదా మరేదైనా డ్రై ఫ్రూట్స్‌తో స్త్రీలకు సమస్య ఉంటే వాటిని తినకుండా ఉండాలి. గర్భం దాల్చిన మొదటి నెల నుంచి చివరి నెల వరకు బాదంపప్పును తినవచ్చు. అయితే వీటిని ఎక్కువగా తీసుకోకుండా ఉంటే మంచిది.