బీరకాయతో చాలా ఆరోగ్య ప్రయోజనాలున్నాయని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. దీనిలోని విటమిన్ ఏ, సీ, పోషకాలు రక్తహీనత, మలబద్ధకం తగ్గిస్తాయని పేర్కొంటున్నారు. జ్వరంతో బాధ పడే వారు బీరకాయ పొట్టుతో చేసిన పచ్చడి తింటే వెంటనే ఉపశమనం లభిస్తుందంటున్నారు. కాలేయానికి మేలు చేస్తుందని, గుండె జబ్బులు రాకుండా చేస్తుందని జీర్ణక్రియను మెరుగుపరుస్తుందని పేర్కొంటున్నారు.