మధుమేహం అదుపులో ఉంచేలా మిల్లెట్లు కీలక పాత్ర పోషిస్తాయి. మధుమేహం ఉన్న వారు జొన్న రొట్టెలు తినాలని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. అలాగే రాగులు, సజ్జలు, బార్లీ, ఓట్స్ వంటివి డయాబెటిస్ వ్యాధిగ్రస్తులకు మేలు చేస్తాయని చెబుతున్నారు. రాగుల్లోని ఫైబర్ చక్కెర స్థాయిలు నియంత్రించడం సహా జీవక్రియను వేగవంతం చేస్తుంది. బార్లీతో కొలెస్ట్రాల్ నియంత్రించవచ్చు. ఓట్స్ తో నచ్చిన ఆహారంతో పాటు ఆరోగ్యం కూడా లభిస్తుందంటున్నారు.