చాలామంది టీని ఇష్టంగా తాగుతారు. అయితే, ఎక్కువగా తాగితే మలబద్దకం, ఎసిడిటీ, నిద్రలేమి, డీహైడ్రేషన్, ఆందోళన ఏర్పడతాయని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. అలాగే, చల్లని టీని పదే పదే వేడి చేసి తాగితే క్యాన్సర్ ప్రమాదాన్ని పెంచుతుందని అంటున్నారు. ఇది స్లో పాయిజన్ లాగా పని చేస్తుందని పేర్కొంటున్నారు. అలాగే, వేడి టీ తాగిన తర్వాత నీళ్లు తాగితే అజీర్తి, లూజ్ మోషన్, జలుబు, ఫ్లూ వస్తాయంటున్నారు.