రక్తహీనత ఉన్న వారికి ఖర్జూరం మంచి ఆహారం. కానీ ఇందులో తీపి ఎక్కువ ఉండడంతో మధుమేహం ఉన్న వారు తినొచ్చా? అనే సందేహం కలుగుతుంది. రోజులో రెండు నుంచి మూడు ఖర్జూరాలు తినొచ్చని, వీటిని తినడం వల్ల రక్తంలో స్వల్ప స్థాయిలోనే గ్లూకోజ్ పెరుగుతుందని నిపుణులు చెబుతున్నారు. రక్తంలో షుగర్ తక్కువగా ఉండి బాధపడేవారికి ఖర్జూరం మంచి ఆహారం. ఖర్జూరంతో పాటు, బాదం, వాల్ నట్ కలిపి ఇంకా ఆరోగ్యకరమని నిపుణులు సూచిస్తున్నారు.