ఈ ఏడాది చైత్ర మాసం పౌర్ణమి ఏప్రిల్ 5న ఉదయం 9:19 గంటలకు ప్రారంభమై ఏప్రిల్ 6న ఉదయం 10:04 గంటలకు ముగుస్తుంది. ఉదయతిథి ప్రకారం ఈసారి హనుమాన్ జయంతిని ఏప్రిల్ 6న మాత్రమే జరుపుకోనున్నారు. ఆ రోజు శుచిగా తయారై గుడికి వెళ్లి హనుమంతుని దర్శించి నెయ్యి లేదా నూనె దీపం వెలిగించాలి. అనంతరం హనుమాన్ చాలీసా 11 సార్లు చదవాలి. ఇలా చేస్తే సమస్యలు తొలగుతాయని పండితులు చెబుతున్నారు.