చాలామందిలో రాత్రి పూట ఆస్తమా లక్షణాలు ఎక్కువగా ఉంటాయి. పడుకునే గదిని దుమ్ము లేకుండా శుభ్రంగా ఉంచాలి. బెడ్ షీట్లు, తలగడలు ఎప్పటికప్పుడు మార్చాలి. పెంపుడు జంతువులకు దూరంగా ఉండాలి. రాత్రి పడుకునే ముందు ఇంట్లో ఎయిర్ ప్రెషనర్లు, బలమైన వాసనలు లేకుండా చూసుకోవాలి. అలాగే, సిగరెట్, చల్లని గాలి, సుగంధాలు వంటివి ఆస్తమాను పెంచుతాయని అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు.