తిరుపతి శ్రీ తాతయ్య గుంట గంగమ్మ జాతర చాటింపు వేశారని తెలియగానే చిన్న పెద్ద తారతమ్యం లేకుండా వేషాలు వేస్తారు. తొలి వేషాన్ని కైకాల కులస్తులు, చాకలి కులస్తులు వేస్తారు. భక్తులు బుధవారం బైరాగి వేషంలో శరీరమంతా తెల్లనామం లేదా విభూతి పూసుకొని నల్లని బొట్లు పెట్టుకుని కనిపించిన వారిని బూతులు తిడుతూ ఆలయానికి చేరుకుంటారరు. తర్వాత అమ్మవారిని దర్శించుకుంటారు.