మెడ చుట్టూ ముడతలు పడడం, మెడ దగ్గర చర్మం నల్లబడడం వంటి సమస్యలతో చాలామంది మహిళలు బాధపడుతుంటారు. ఈ సమస్యలు ఉన్నవారు ఆలివ్ లేదా కొబ్బరి నూనెలో ఏదైనా ఎసెన్షియల్ ఆయిల్ కలపాలి. దానిని 15 నిమిషాల పాటు భుజాల నుంచి ముఖం వైపుకి మసాజ్ చేయాలి. వారానికి ఒకసారి ఇలా నెక్ మసాజ్ చేసుకోవడం వల్ల మెడ చుట్టూ నల్లబడడం, ముడతలు పడటం వంటి సమస్యలు పోతాయి. దీంతో చర్మం మెరుపు సంతరించుకుంటుంది.