రాగి పాత్రల్లో నీరు తాగితే ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయి. రక్త ప్రసరణ వ్యవస్థను మెరుగుపరిచి రక్తనాళాలలో రక్తసరఫరా సరిగా జరిగేలా రాగి నీళ్లు దోహదపడతాయి. దీనివల్ల గుండె సంబంధిత రోగాలు దరిచేరవు. ఆర్థరైటిస్, కీళ్లనొప్పులు, కీళ్ల సమస్యలతో బాధపడుతున్నవారికి కూడా రాగి పాత్రలో నీరు చాలా మంచి చేస్తాయి. రాగి శరీరంలోని ఎముకలను దృఢంగా మారుస్తుంది. రాగి నీళ్లతో గాయాలను కడగడం ద్వారా అవి త్వరగా నయమవుతాయి.