వైన్ తాగే వ్యక్తులు తరచుగా నిద్రపోతారు. కానీ తక్కువ వ్యవధిలో మేల్కొంటారు. ఆ తర్వాత తిరిగి నిద్రపోవడం చాలా కష్టమవుతుంది. వైన్ తీసుకోవడం వల్ల పదేపదే మూత్రం వస్తుంది. దీంతో నిద్రకు భంగం వాటిల్లుతుంది. ఫలితంగా నిద్రలేమి సమస్య తలెత్తుతుంది. నిద్రవేళకు ముందు వైన్ తాగడం వల్ల గాఢ నిద్ర వస్తుందనుకోవడం అపోహ మాత్రమే. ప్రశాంతమైన నిద్ర కోసం వేరే పద్ధతులు అనుసరించడం మంచిదని నిపుణులు చెబుతున్నారు.