భారత్‌లో తొలిసారి ఆసియా పురుషుల హాకీ చాంపియన్స్ ట్రోఫీ జరుగుతోంది. చెన్నైలోని మేయర్ రాధాకృష్ణన్ స్టేడియం వేదికగా జరుగుతున్న ఈ టోర్నీలో భారత్‌తోపాటు పాకిస్తాన్, చైనా, మలేసియా, జపాన్, దక్షిణ కొరియా జట్లు తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నాయి. తొలి రోజు గురువారం(ఆగస్టు 3) కొరియాతో జపాన్, మలేసియాతో పాకిస్తాన్, చైనాతో భారత్ పోటీపడతాయి. భారత్, పాక్ మ్యాచ్ ఆగస్టు 9న జరుగుతుంది. ఆరు జట్ల మధ్య ముందుగా రౌండ్ రాబిన్ లీగ్ పద్ధతిలో మ్యాచ్‌లను నిర్వహిస్తారు. మ్యాచ్‌లను స్టార్ స్పోర్ట్స్ ఫస్ట్ చానెల్‌లో ప్రత్యక్ష ప్రసారం చేస్తారు.