క్యారెట్ ఆరోగ్యానికి, అందానికి చాలా మంచిది. అలాగే బ్లాక్ క్యారెట్ వల్ల అనేక లాభాలున్నాయి. బ్లాక్ క్యారెట్‌లో ఆంథోసైనిన్ పుష్కలంగా ఉంటుంది. ఇది గుండె ఆరోగ్యానికి చాలా మేలు చేస్తుంది. బ్లాక్ క్యారెట్ రక్త ప్రసరణను మెరుగుపరుస్తుంది. మలబద్ధకం, గ్యాస్, ఉబ్బరం, గుండెల్లో మంట, అలసట, విరేచనాలు వంటి వ్యాధులను నయం చేస్తుంది. బ్లాక్ క్యారెట్‌లోని విటమిన్ సీ రక్తంలో తెల్ల రక్త కణాల సంఖ్యను పెంచుతుంది. బ్లాక్ క్యారెట్ తినడం అల్జీమర్స్ నుండి రక్షించగలదని కొన్ని అధ్యయనాలు చెబుతున్నాయి. బ్లాక్ క్యారెట్‌కు క్యాన్సర్ కణాలను నాశనం చేసే శక్తి ఉంది. నల్ల క్యారెట్ మధుమేహ వ్యాధిగ్రస్తులకు దివ్యఔషధంగా పనిచేస్తుంది. అలాగే చలికాలంలో బ్లాక్‌క్యారెట్ తీసుకోవటం వల్ల బరువు తగ్గుతారట.