ఆస్ట్రేలియాతో వన్డే సిరీస్‌లో వరుసగా హాఫ్ సెంచరీ, సెంచరీ బాదిన శుభ్‌మన్ గిల్‌కు మూడో మ్యాచ్‌కు విశ్రాంతి ఇవ్వాలని టీమిండియా మేనేజ్మెంట్ భావించింది. వన్డే వరల్డ్ కప్ ప్రారంభానికి ముందు కాస్త విరామం ఇస్తే శారీరకంగా, మానసికంగా పుంజుకోవడానికి అవకాశం ఉంటుందనే ఉద్దేశంతో బెంచ్‌కే పరిమితం చేయనుంది. దీంతో రాజ్‌కోట్ వేదికగా జరగనున్న మూడో మ్యాచ్‌కు గిల్ అందుబాటులో ఉండడు.