ఆసియా క్రీడ స్వర్ణ పతకం గెలిచి భారత మహిళా జట్టు చరిత్ర సృష్టించింది. ఈ నేపథ్యంలో టీమిండియా క్రికెటర్ జెమీమా రోడ్రిగ్స్ ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. ఇక మనం పురుషుల క్రికెట్ జట్టు గురించి మాట్లాడుకుందాం. వారికి ఒకటే విజ్ఞప్తి. ఇప్పుడు మేం స్వర్ణం గెలిచాం. ఇక మీ వంతు. మీరు కూడా గోల్డ్ మెడల్ తీసుకురావాలి అని పేర్కొంది.