న్యూజిలాండ్‌తో నేడు జరిగే బిగ్ మ్యాచ్‌కి హార్దిక్ పాండ్యా దూరం కావడంతో అతడి స్థానంలో ఎవరిని ఎంచుకుంటారనేది కీలకంగా మారింది. పిచ్ పరిస్థితిని బట్టి చూస్తే నేరుగా షమీకి అవకాశం దక్కవచ్చు. అయితే బ్యాటింగ్ బలహీనంగా మారే అవకాశం ఉంది. దీంతో సూర్యకుమార్ లేదా ఇషాన్ కిషన్‌లలో ఒకరికి అవకాశం దక్కుతుంది. అలా చేస్తే శార్దుల్ ఠాకూర్ పూర్తి స్థాయిలో ఐదో బౌలర్‌గా తన బాధ్యతను నిర్వర్తించాల్సి ఉంటుంది.