వన్డే ప్రపంచకప్లో భాగంగా మరో కీలక పోరుకు సర్వం సిద్ధమైంది. బెంగళూరులోని చిన్న స్వామి స్టేడియంలో ఇంగ్లండ్, శ్రీలంక జట్ల మధ్య కీలక మ్యాచ్ జరగనుంది. త్వరలో ప్రారంభం కానున్న ఈ పోరులో ఇంగ్లండ్ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. ఈ మ్యాచ్ లో ఇంగ్లండ్ జట్టు మూడు మార్పులతో బరిలోకి దిగనుంది. క్రిస్ వోక్స్, మొయిన్ అలీ, లివింగ్ స్టోన్ మళ్లీ జట్టులోకి వచ్చారు. మరోవైపు లంక జట్టు కూడా రెండు మార్పులతో బరిలోకి దిగనుంది. ఏంజెలో మాథ్యూస్, లహిరు కుమార జట్టులోకి వచ్చారు. ఈ మ్యాచ్ ఇరు జట్లకు ఎంతో ప్రతిష్టాత్మకమనే చెప్పాలి. పాయింట్ల పట్టికలో, ఈ రెండు జట్లు ఇప్పటివరకు నాలుగు మ్యాచ్లు ఆడాయి మరియు తలా ఒక విజయంతో దిగువ నుండి మూడు మరియు నాలుగు స్థానాల్లో ఉన్నాయి. ఈ మ్యాచ్లో ఓడిన జట్టు దాదాపు సెమీస్ రేసు నుంచి నిష్క్రమిస్తుంది.