వరల్డ్ కప్‌లో బంగ్లాదేశ్‌తో మ్యాచ్ సందర్భంగా టీమిండియా ఆల్ రౌండర్ హార్దిక్ పాండ్యా గాయపడడం తెలిసిందే. అయితే హార్దిక్ పాండ్యా ఫిట్ నెస్‌పై తాజా కబురు అందింది. ప్రస్తుతం బెంగళూరులోని జాతీయ క్రికెట్ అకాడమీలో కోలుకుంటున్న పాండ్యా నవంబర్ 2న శ్రీలంకతో జరిగే మ్యాచ్ కల్లా జట్టులో చేరతాడని తెలుస్తోంది. హార్దిక్ పాండ్యా ముంబయిలో జట్టుతో కలుస్తాడని భారత క్రికెట్ వర్గాలు చెబుతున్నాయి.