బ్రెజిల్ స్టార్ ఫుట్‌బాల్ ప్లేయర్ నెయ్మర్కు గాయమైంది. ఫిఫా వరల్డ్ కప్ క్వాలిఫయర్స్‌లో గాయపడిన నెయ్మర్ ఏడాది పాటు ఆటకు దూరం కానున్నాడు. ఉరుగ్వేతో మ్యాచ్ సమయంలో నెయ్మర్ ఎడమ మోకాలికి దెబ్బ తగిలింది. నడవలేని స్థితిలో ఉన్న నెయ్‌మర్‌ను గ్రౌండ్ సిబ్బంది స్ట్రెచర్ మీద తీసుకెళ్లారు. అత్యవసరంగా సర్జరీ చేయాలని వైద్యులు సూచించడంతో వెంటనే ఆపరేషన్ చేశారు. సర్జరీ విజయవంతం అయినట్లు బ్రెజిల్ టీమ్ డైరెక్టర్ రోడ్రిగో లాస్మర్ తెలిపారు.