తాను రాజకీయాల్లోకి రావాలనుకుంటున్నట్టు క్రికెటర్ అంబటి రాయుడు స్పష్టం చేశాడు. ప్రస్తుతం రాష్ట్రమంతా పర్యటిస్తున్నానని అతడు చెప్పాడు. 2024 ఎన్నికల్లో గుంటూరు నుంచి ఎంపీగా పోటీ చేసే విషయమై ఇంకా నిర్ణయం తీసుకోలేదని వివరణ ఇచ్చాడు. ముఖ్యమంత్రి జగన్ పరిపాలన బాగుందని, యువ రాజకీయ నేతలకు జగన్ స్ఫూర్తి కావాలని ఆయన పిలుపునిచ్చారు.