డ్రై ప్రూట్స్ లలో ఒకటి అంజీరా పండు. ఈ పండులో విటమిన్ ఎ, బి6, సి, పొటాషియం, క్యాల్షియం, ఐరన్, మెగ్నీషియం, ఫైబర్, కార్బోహైడ్రేట్స్ వంటి ఎన్నో పోషకాలు ఉన్నాయి. అంజీరాలను తీసుకోవడం వల్ల మన ఆరోగ్యానికి ఎంతో మేలు కలుగుతుంది. అంజీరా పండ్లు రోజూ 2 లేదా 3 పాల్లలో వేసి రాత్రంతా నానబెట్టి ఉదయాన్నే ఈ అంజీరాలను తిని పాలను తాగాలి. ఇలా చేయడం వల్ల పురుషుల్లో లైంగిక సమస్యలు తగ్గి లైంగిక సామర్థ్యం పెరుగుతుంది. చర్మం, జుట్టు సమస్యలను కూడా తొలగిస్తుందని నిపుణులు చెబుతున్నారు.