గాయం కారణంగా ప్రపంచకప్ టోర్నీ నుంచి టీమిండియా స్టార్ ఆల్ రౌండర్ హార్దిక్ పాండ్యా నిష్క్రమించిన సంగతి తెలిసిందే. దీనిపై తాజాగా హార్దిక్ స్పందించాడు. ఈ మేరకు ఓ ట్వీట్ చేస్తూ.. ‘ప్రపంచ కప్‌లో మిగిలిన మ్యాచ్‌లను ఆడలేను అనే విషయాన్ని నేను జీర్ణించుకోలేకపోతున్నా. కానీ ప్రతి గేమ్ టీమ్‌తో ఉండి వారిని ఉత్సాహపరుస్తుంటాను. ఈ టీమ్ ఎంతో స్పెషల్. మేం ప్రతి ఒక్కరినీ గర్వపడేలా చేస్తామని నమ్ముతున్నాను’ అని పేర్కొన్నాడు.