ప్రపంచకప్-23 టోర్నీకి దూరమైన స్టార్ ఆల్ రౌండర్ హార్దిక్ పాండ్యా గాయంపై బీసీసీఐ మరిన్ని విషయాలు వెల్లడించింది. బెంగళూరులో తిరిగి ట్రైనింగ్ మొదలు పెట్టిన హార్దిక్ ఎడమ కాలి మడమలో మళ్లీ వాపు కనిపించినట్లు తెలిపింది. ‘ఇంతకుముందు చెప్పినట్లు పాండ్యాకు ఫ్రాక్చరేమీ కాలేదు. అయితే చిన్న చీలిక మాత్రం ఉంది. బౌలింగ్ చేసే పరిస్థితి లేదు. ఈ గాయాన్ని ఇంజెక్షన్లతో మేనేజ్ చేయలేం. గురువారం ఈ గాయం తిరగబెట్టింది’ అని పేర్కొంది.