టీమిండియా స్టార్ క్రికెటర్, కింగ్ కోహ్లీ ఇవాళ 35వ వసంతంలోకి అడుగు పెడుతున్నారు. ఈ సందర్భంగా విరాట్‌కు క్రికెటర్స్, ఫ్యాన్స్ అభినందనలు తెలుపుతున్నారు. కోహ్లీ బర్త్‌డే కావడంతో అనుష్క శర్మ ఇంస్టాలో 'తన జీవితంలోని ప్రతి పాత్రలో అక్షరాలా అసాధారణంగానే ఉంటాడు! నేను కూడా అతని గ్రేట్ జర్నీలో కొనసాగుతున్నా. నా జీవితంలో అంతకు మించి ప్రేమిస్తున్నా అని, లవ్ యూ విరాట్' అంటూ పోస్ట్ చేసింది. ప్రస్తుతం, ఇది సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.