ప్రపంచకప్ లో నేడు భాగంగా దక్షిణాఫ్రికా, టీమిండియా జట్లు మధ్య మ్యాచ్ జరుగుతుంది. టీమిండియా నిర్ణీత 50 ఓవర్లలో 5 వికెట్లకు 326 పరుగులు చేసింది. ఈ మ్యాచ్‌లో కోహ్లీ 119 బంతుల్లో 100 పరుగులు చేశాడు. దీంతో కోహ్లీ 101 పరుగులతో నాటౌట్‌గా ఉండగా, జడేజా 15 బంతుల్లో 3 ఫోర్లు, 1 సిక్స్‌తో 29 పరుగులు (నాటౌట్) చేశాడు. అయ్యర్ 87 బంతుల్లో 7 ఫోర్లు, 2 సిక్సర్లతో 77 పరుగులు చేశాడు.కెప్టెన్ రోహిత్ శర్మ 40, శుభ్‌మన్ గిల్ 23 పరుగులు చేశారు. కేఎల్ రాహుల్ 8, సూర్యకుమార్ యాదవ్ 22 పరుగుల వద్ద ఔటయ్యారు. సఫారీ బౌలర్లలో ఎంగిడి, జాన్సెన్, రబడ, కేశవ్ మహరాజ్, షమ్సీ తలో వికెట్ తీశారు.