హైదరాబాద్ క్రికెట్ అభిమానులకు చేదువార్త. భారత్-ఆస్ట్రేలియా మధ్య డిసెంబర్ 3న ఉప్పల్ వేదికగా జరగబోయే ఐదో టీ20 మ్యాచ్ వేదికను బీసీసీఐ మార్చింది. డిసెంబర్ 3న తెలంగాణలో అసెంబ్లీ ఫలితాలు వెలువడనుండటంతో ఈ మ్యాచ్ను హైదరాబాద్ నుంచి బెంగళూరుకు తరలించినట్లు తెలుస్తోంది. అసెంబ్లీ ఎన్నికల ఫలితాల నేపథ్యంలో ఉప్పల్ వేదికగా జరగబోయే మ్యాచ్కు భద్రత కల్పించలేమని తెలంగాణ పోలీసులు తెలిపినట్లు సమాచారం.